India Hockey Jersey Controversy: హాకీ ఇండియా జర్సీ వివాదం వెనుక అసలు నిజం!
రాబోయే హాకీ ప్రపంచ కప్ కోసం భారత పురుషుల, మహిళా జట్లు ధరించబోయే కొత్త జర్సీ రంగుపై వివాదం చెలరేగింది. సాంప్రదాయంగా ఉన్న నీలం (Blue) రంగు నుంచి కాషాయ (Saffron) రంగులోకి జర్సీని మారుస్తూ హాకీ ఇండియా ఇటీవల ఫోటోలను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై పలువురు మాజీ క్రీడాకారులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ, దీని వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని ఆరోపించారు.
India Hockey Jersey Controversy: హాకీ ఇండియా జర్సీ వివాదం వెనుక అసలు నిజం!
అయితే ఈ విమర్శలను హాకీ ఇండియా తీవ్రంగా తోసిపుచ్చింది. జర్సీ మార్పు వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని స్పష్టం చేసింది. అంతర్జాతీయ హాకీ మ్యాచ్‌లలో ప్రస్తుతం వాడుతున్న బ్లూ సింథటిక్ మైదానంలో నీలం రంగు జర్సీలు కలిసిపోయినట్లుగా కనిపిస్తాయని, దీనివల్ల ఆటగాళ్లను గుర్తించడం ఇబ్బందిగా మారుతుందని వివరించింది. ఆటగాళ్లు మైదానంలో స్పష్టంగా కనిపించేందుకే రంగును మార్చాల్సి వచ్చిందని తెలిపింది.
ఆటగాళ్లు, సపోర్టింగ్ స్టాఫ్‌తో సంప్రదింపులు జరిపిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు హాకీ ఇండియా వెల్లడించింది. మన జాతీయ పతాకంలోని రంగులలో ఒకటైన కాషాయం.. ధైర్యం, త్యాగం, జాతీయ గౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొంది. కాగా, ఈ ఏడాది హాకీ ప్రపంచ కప్ ఆగస్టు 15 నుండి 30 వరకు జరగనుంది. బెల్జియం, నెదర్లాండ్స్ దేశాలు సంయుక్తంగా ఈ టోర్నమెంట్‌కు ఆతిథ్యమిస్తున్నాయి.
హాకీ ప్రపంచ కప్ జర్సీ రంగు మార్పుపై వివాదం.. స్పష్టతనిచ్చిన హాకీ ఇండియా
