దని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. శనివారం ఉదయం తిరుపతి కచ్ఛపి కళాక్షేత్రంలో భారత మాజీ రాష్ట్రపతి, మహనీయ విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, జిల్లా విద్యాశాఖ అధికారి కె.వి.ఎన్. కుమార్, అడిషనల్ ప్రాజక్ట్ కో ఆర్డినేటర్, సమగ్రశిక్ష భరత్ కుమార్ రెడ్డి లతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సమర్థ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంలో కీలక సంస్కరణలను అమలు చేస్తోందన్నారు. మారుతున్న కాలానికి, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగ రంగాల అవసరాలకు అనుగుణంగా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. తల్లికి వందనం పథకం ద్వారా గత రెండు సంవత్సరాల్లో అర్హులైన ప్రతి విద్యార్థికి, కుటుంబంలో పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా నేరుగా తల్లుల ఖాతాల్లో ఆర్థిక సహాయం జమ చేసినట్లు తెలిపారు. తిరుపతి జిల్లాలో మొత్తం 2,58,000 మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందగా, వారిలో 1,72,000 మందికి పైగా ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న కుటుంబాలకు చెందినవారేనని వివరించారు.
విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా రేషనలైజేషన్ ప్రక్రియ చేపట్టి, ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రాథమిక, ఫౌండేషన్, మోడల్ ప్రైమరీ పాఠశాలల్లో 1 నుంచి 5వ తరగతి వరకు ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేలా వ్యవస్థను బలోపేతం చేశామన్నారు. ఒకే తరగతి గదిలో వివిధ తరగతుల విద్యార్థులకు ఒకే ఉపాధ్యాయుడు బోధించే విధానానికి స్వస్తి పలికామని, ఈ సంస్కరణల ఫలితాలు రాబోయే నాలుగైదేళ్లలో స్పష్టంగా కనిపిస్తాయన్నారు. విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేందుకు జిల్లాలో 10వ తరగతి, ఇంటర్మీడియట్లో ప్రతిభ కనబరిచిన 258 మంది విద్యార్థులకు ‘షైనింగ్ స్టార్స్’ అవార్డులు అందజేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెగా పేరెంట్–టీచర్ మీటింగ్స్ నిర్వహించడం ద్వారా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఒకే వేదికపైకి వచ్చి విద్యార్థుల చదువు, ప్రవర్తన, పాఠ్యేతర కార్యక్రమాలు, తోటి విద్యార్థులతో వారి ప్రవర్తన తదితర అంశాలపై చర్చించే అవకాశం కల్పించామన్నారు.

విద్యార్థులు కేవలం పాఠ్యాంశాల్లోనే కాకుండా క్రీడలు, సంగీతం, నృత్యం, పఠనం తదితర రంగాల్లోనూ రాణించేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని,మార్కులు, ర్యాంకులు మాత్రమే విద్యార్థుల ప్రతిభకు కొలమానం కాదన్నారు. క్రీడలు, ఇతర పాఠ్యేతర కార్యక్రమాలు విద్యార్థుల మానసిక, శారీరక వికాసానికి దోహదపడతాయన్నారు. తరగతిలో మొదటి స్థానాల్లో నిలిచే విద్యార్థులపైనే కాకుండా ప్రతి విద్యార్థిపై ఉపాధ్యాయులు సమాన శ్రద్ధ చూపాలని, వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక ప్రోత్సాహం, మార్గదర్శకత్వం అందించాలన్నారు. చిన్న వయస్సు నుంచే ఐఐటీ, సివిల్స్ వంటి పోటీ పరీక్షల పేరుతో విద్యార్థులపై అధిక ఒత్తిడి తీసుకురావడం సరికాదని, విద్యార్థుల ఆసక్తి, సామర్థ్యాలను గుర్తించి సరైన మార్గదర్శకత్వం అందించాలన్నారు. సాంకేతికత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఉపాధ్యాయులు కూడా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ పొందాలని సూచించారు. విద్యార్థులు ఇంటర్నెట్, సోషల్ మీడియాను సద్వినియోగం చేసుకునేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలన్నారు. ఉపాధ్యాయుడి మానవతా స్పర్శ విద్యార్థి జీవితాన్ని మార్చగలదని, సమాజంలో నూతన తరాన్ని తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని తెలిపారు.

స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ.. తల్లిదండ్రుల తర్వాత విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని, విద్యార్థుల్లోని ప్రతిభను గుర్తించి వారికి సరైన ప్రోత్సాహం అందించడంలో గురువులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. విద్యార్థుల ఉన్నత విద్యకు ప్రభుత్వం అవసరమైన సహాయ సహకారాలు అందిస్తోందని తెలిపారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం కృషి చేస్తున్న ఉపాధ్యాయులందరికీ గురుపూజోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.Grand Teachers’ Day Celebrations: District Collector Dr. S. Venkateswar

జిల్లా విద్యాశాఖ అధికారి కె.వి.ఎన్. కుమార్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయ వృత్తి కేవలం ఉద్యోగం మాత్రమే కాదని, అది బాధ్యత, తపస్సు, మహత్తరమైన సామాజిక సేవ అని అన్నారు. గత 100 రోజులుగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేసి, వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ, రోజువారీ పరీక్షలు నిర్వహిస్తూ వారి విద్యా ప్రగతికి ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారని తెలిపారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ గారి మార్గదర్శకత్వంలో 36 మండలాల్లో 36 రోజుల పాటు ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించామని, వేసవి సెలవుల్లో కూడా ఉపాధ్యాయులు ఇంటింటికీ వెళ్లి బడికి దూరమైన పిల్లలను గుర్తించడంతో పాటు, సుమారు 2,500 మంది ప్రైవేటు పాఠశాలల విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించినట్లు తెలిపారు.

*: జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్*
*ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు**విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలు – విద్యార్థుల సమగ్ర వికాసమే లక్ష్యం**ప్రతి బిడ్డ పాఠశాలకు వచ్చేలా, నాణ్యమైన విద్య అందేలా చర్యలు**జిల్లాలో 65 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించి ప్రశంశా పత్రాలు అందజేత*
విద్యార్థులకు పాఠ్యపుస్తకాల బోధనతో పాటు సైన్స్‌పై శాస్త్రీయ దృక్పథం, క్రీడల ద్వారా శారీరక దారుఢ్యం, యోగా, మెడిటేషన్ ద్వారా మానసిక ప్రశాంతత, ‘నో డ్రగ్స్’ కార్యక్రమాల ద్వారా మాదకద్రవ్యాలకు దూరంగా ఉండేలా అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. జిల్లాలో ఉత్తమ సేవ*: జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్*
