సూపర్ స్టార్ కృష్ణ వారసత్వంతో ఇప్పటికే మహేష్ బాబు టాలీవుడ్లో అగ్ర హీరోగా వెలుగొందుతున్నారు. ఇప్పుడు అదే ఘట్టమనేని కుటుంబం నుంచి మూడో తరం వారు వెండితెరపై మెరిసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు సోదరి, నటి మంజుల గారాల పట్టి జాన్వీ స్వరూప్ హీరోయిన్గా పరిచయం కానున్నారు.

వెండితెరకు సిద్ధమవుతున్న జాన్వీ
కొంతకాలంగా జాన్వీ స్వరూప్ తెరంగేట్రంపై అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా ఆమె తల్లి, నటి మంజుల అధికారికంగా ధృవీకరించారు. ప్రస్తుతం ఆమె ఎంట్రీకి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే సితార ఘట్టమనేని యాడ్స్ ద్వారా పాపులర్ అవ్వగా, గౌతమ్ ఘట్టమనేని కూడా తన ఎంట్రీ కోసం సిద్ధమవుతున్నారు. మరోవైపు కృష్ణ సోదరుడు, రమేశ్ బాబు తనయుడు జయకృష్ణ కూడా హీరోగా పరిచయం కాబోతున్నారు. వీరితో పాటు ఇప్పుడు జాన్వీ స్వరూప్ పేరు కూడా టాలీవుడ్ వర్గాల్లో ప్రముఖంగా వినిపిస్తోంది.

టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వనున్న మహేష్ బాబు మేనకోడలు – జాన్వీ స్వరూప్ లేటెస్ట్ ఫొటోస్
సోషల్ మీడియాలో ట్రెండింగ్
టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వనున్న మహేష్ బాబు మేనకోడలు.. జాన్వీ స్వరూప్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్!

సినిమాల్లోకి రాకముందే జాన్వీ సోషల్ మీడియాలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. తన స్టైలిష్ ఫొటోషూట్స్ మరియు గ్లామరస్ వీడియోలను షేర్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచుకుంటున్నారు. తాజాగా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

అందంతో అందరినీ మంత్రముగ్ధులను చేస్తూ..
తాజా ఫొటోల్లో జాన్వీ చాలా ట్రెండీగా కనిపించారు. లేత పసుపు రంగు (Light Yellow) క్రాప్ ట్యాంక్ టాప్‌తో, దానికి చక్కగా సరిపోయే ఎమరాల్డ్ గ్రీన్ జోగర్ ప్యాంట్స్ ధరించి ఆమె ఇచ్చిన ఫోజులు ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఆమె ధరించిన టాప్‌పై ఉన్న ‘అవుట్ ఆఫ్ మై మైండ్.. ప్లీజ్ లీవ్ ఎ మెసేజ్’ అనే స్లోగన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ లుక్‌లో జాన్వీ చాలా నేచురల్‌గా, పర్ఫెక్ట్ హీరోయిన్ మెటీరియల్‌లా కనిపిస్తున్నారని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
