అమరావతి, జూన్ 29: ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత సులభంగా, వేగంగా అందించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ సెంటర్ నుంచి వివిధ శాఖల పనితీరుపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
ప్రజలతో నిత్యం సంబంధాలు కలిగి ఉండే శాఖలు, విభాగాల్లో సేవలు పొందే విధానాన్ని సులభతరం చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో భాగంగా ప్రాథమికంగా 11 రకాల సేవలను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు ప్రారంభించినట్లు అధికారులు వివరించారు.
ప్రజా ఫిర్యాదుల వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇందులో భాగంగా ఆన్‌లైన్ ఫిర్యాదులతో పాటు మనమిత్ర వాట్సాప్ నంబర్ ద్వారా కూడా ఫిర్యాదులు స్వీకరించాలి. ప్రజలు పంపే వాయిస్ మెసేజ్‌లను కూడా ఫిర్యాదులుగా పరిగణనలోకి తీసుకుని తక్షణ పరిష్కారం చూపాలని ఆదేశించారు.
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3 వేల ప్రాంతాల్లో ఉన్న నెట్‌వర్క్ కనెక్టివిటీ సమస్యను వచ్చే మూడు నెలల్లోగా పరిష్కరించాలని ముఖ్యమంత్రి గడువు విధించారు. ఈ మేరకు సంబంధిత టెలికాం సంస్థలతో చర్చలు జరపాలని అధికారులను ఆదేశించారు.ప్రభుత్వ సేవలు

ప్రభుత్వ సేవలు మరింత సులభతరం: మనమిత్ర ద్వారా ఫిర్యాదుల స్వీకరణ


సమస్యల పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలో పర్యటించాలని అధికారులకు ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. దీని ప్రకారం సెక్రటరీలు నెలకు 3 రోజులు, హెచ్‌ఓడీలు నెలకు 6 రోజులు, జిల్లా కలెక్టర్లు నెలకు 8 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించి, సమస్యలు అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి తక్షణ పరిష్కారాలు చూపాలని ఆదేశించారు.
స్త్రీ, శిశు సంక్షేమ శాఖ చేపట్టిన నవచేతన పథకంపై సమావేశంలో ప్రెజెంటేషన్ ఇచ్చారు. పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలను పర్యవేక్షించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 33,949 మంది పిల్లలకు స్క్రీనింగ్ నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. అంగన్వాడీ కేంద్రాలతో పాటు, నేరుగా ఇళ్లకు వెళ్లి స్క్రీనింగ్ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని, దీనిపై పైలెట్ ప్రాజెక్ట్ అమలు చేయనున్నామని తెలిపారు.
ఈ సమావేశంలో సీఐఐ ప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆర్టీజీఎస్ సెంటర్‌లో కృత్రిమ మేధ సహా వివిధ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిపాలనలో ఎలా వినియోగిస్తున్నారో ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్ వివరించారు. అలాగే, సీఐఐ గ్లోబల్ లీడర్‌షిప్ సెంటర్‌ను త్వరగా ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు సీఐఐ ప్రతినిధులకు సూచించారు.

ప్రభుత్వ సేవలు మరింత సులభతరం: మనమిత్ర ద్వారా ఫిర్యాదుల స్వీకరణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *