శ్రీ కొల్లాపురమ్మ ఆలయ ధ్వజస్తంభ పూజలు అభిషేకాలు.
అన్నమయ్య జిల్లా పీలేరు c6 న్యూస్.
భక్తిశ్రద్ధలతో
శ్రీ కొల్లాపురమ్మ ఆలయ ధ్వజస్తంభ పూజలు అభిషేకాలు.
పీలేరు రైల్వే స్టేషన్ సమీపంలో సింహపురి కాలనీలో కొండేటి దేవేంద్ర సరస్వతి దంపతులు నిర్మించిన శ్రీ కొల్లాపురమ్మ ఆలయం ధ్వజస్తంభ పూజా కార్యక్రమాలు గురువారంవేకువ జామున రంగయ్య స్వాములచే శాస్త్రోక్తంగా గణపతి,నవగ్రహ దోష నివారణ,ధ్వజస్తంభానికి ప్రత్యేక వస్త్రా పుష్పదర్భలతో పూజలు నిర్వహించి అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక అలంకరణ అనంతరం భక్తులకుదర్శనభాగ్యం కల్పించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డప్ప రెడ్డి దంపతులు, రాయల దేవేంద్ర దంపతులు, మణికంఠ, వేణు, మురళి రాఘవ శివప్రసాద్, దేవేంద్ర శివయ్య రమేష్ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.Flagstaff rituals and Abhishekam at the Sri Kollapuramma Temple.
