పీలేరు డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా – 18 ప్రముఖ కంపెనీలతో ఉద్యోగ అవకాశాలు.
అన్నమయ్య జిల్లా పీలేరు c6tv న్యూస్ గోపి.
పీలేరు డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా – 18 ప్రముఖ కంపెనీలతో ఉద్యోగ అవకాశాలు.
కూటమి ప్రభుత్వ లక్ష్యం నిరుద్యోగ రహిత రాష్ట్రం – ఎమ్మెల్యే నల్లారి కిషోర్.
శుక్రవారం పీలేరులోని సంజయ్ గాంధీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
చదువుకున్న యువతీ యువకులు, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు.
Mega Job Fair at Pileru Degree College – Job opportunities with 18 prominent companies.
రాష్ట్రవ్యాప్తంగా 18 ప్రముఖ సంస్థలను ఒప్పించి ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నామని, యువత ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం అందించి, పీలేరు నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా, ఉపాధి పరంగా అగ్రగామిగా నిలపడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలోపీలేరు తహశీల్దార్ శివ కుమార్, ఎంపీడీవో శివ శంకరయ్య, మండల శాఖ అధికారులు ప్రజా ప్రతి నిధులు, కూటమి నాయకులు, పలు కంపెనీల నిర్వాహకులు, ఉపాధ్యాయినీ ఉపాధ్యా యులు, విద్యార్థినీ విద్యార్థులు నిరుద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
