వీఆర్ఏల సమ్మెకు DHPS సంపూర్ణ మద్దతు - సదుం తహసిల్దార్ కార్యాలయం ముందు DHPS జిల్లా అధ్యక్షులు టి.ఎల్. వెంకటేష్ సంఘీభావంవీఆర్ఏల సమ్మెకు DHPS సంపూర్ణ మద్దతు - సదుం తహసిల్దార్ కార్యాలయం ముందు DHPS జిల్లా అధ్యక్షులు టి.ఎల్. వెంకటేష్ సంఘీభావం

వీఆర్ఏల సమ్మెకు DHPS సంపూర్ణ మద్దతు – సదుం తహసిల్దార్ కార్యాలయం ముందు DHPS జిల్లా అధ్యక్షులు టి.ఎల్. వెంకటేష్ సంఘీభావం

C6tv సదుం

అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం
సదుం మండల తహసిల్దార్ కార్యాలయం ఎదుట తమ జీవనోపాధి సమస్యల పరిష్కారం కోసం గత కొన్ని రోజులుగా శాంతియుతంగా నిరసన దీక్ష చేస్తున్న వీఆర్ఏలకు దళిత హక్కుల పోరాట సమితి (DHPS) తరపున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని జిల్లా అధ్యక్షులు టి.ఎల్. వెంకటేష్ ప్రకటించారు. ఈరోజు నిరసన శిబిరాన్ని సందర్శించి వీఆర్ఏలకు సంఘీభావం తెలిపిన అనంతరం ఆయన మీడియతో మాట్లాడుతూ గ్రామ పరిపాలనలో వీఆర్ఏల పాత్ర అత్యంత కీలకమని, కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో, ఎన్నికల సమయంలో, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేసే వీఆర్ఏలను ప్రభుత్వం చిన్నచూపు చూడటం బాధాకరమన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న తరహాలోనే ఆంధ్రప్రదేశ్ లోని వీఆర్ఏలకు కూడా పే స్కేల్ అమలు చేయాలని, సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న నామినీ వీఆర్ఏలను వెంటనే రెగ్యులర్ చేయాలని, వన్ టైం సెటిల్మెంట్ కింద రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వీఆర్వో పోస్టులన్నింటినీ అర్హులైన సీనియర్ వీఆర్ఏలతో భర్తీ చేయాలని, అదేవిధంగా విధి నిర్వహణలో ఉండి మృతి చెందిన వీఆర్ఏ కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం కింద వెంటనే ఉద్యోగం కల్పించాలని, అర్హత కలిగిన వీఆర్ఏలందరికీ తక్షణమే ప్రమోషన్లు కల్పించి న్యాయం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వీఆర్ఏల సమస్యలు పరిష్కారం అయ్యేవరకు తమ పోరాటం ఆగదని, ఈ పోరాటానికి DHPS ఎల్లవేళలా అండగా ఉంటుందని, అవసరమైతే జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో DHPS ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈకార్యక్రమంలో
వీఆర్ఏ జేఏసీ సదుం మండల నాయకులు పాల్గొన్నారు.

వీఆర్ఏల సమ్మెకు DHPS సంపూర్ణ మద్దతు – సదుం తహసిల్దార్ కార్యాలయం ముందు DHPS జిల్లా అధ్యక్షులు టి.ఎల్. వెంకటేష్ సంఘీభావం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *