గండబోయినపల్లిలో దుర్గాదేవి అలంకరణలో శ్రీ సత్యమ్మతల్లి దర్శనం | దసరా శరన్నవరాత్రులు | C6TV

గండబోయినపల్లిలో దుర్గాదేవి అలంకరణలో శ్రీ సత్యమ్మతల్లి దర్శనం | దసరా శరన్నవరాత్రులు | C6TV అన్నమయ్య జిల్లా పీలేరు C6 న్యూస్. వాల్మీకిపురం మండలం గండబోయినపల్లి గ్రామ దేవత శ్రీ దుర్గా దేవి అలంకరణలో దర్శనమిస్తున్న గండబోయినపల్లి కోటలో పిలిస్తే పలికే కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా పేరున్న మహమ్మాన్వితమైన శ్రీ సత్యమ్మతల్లి ఆలయంలో దసరా దేవి శరన్నవరాత్రులలో భాగంగా ఆదివారము ఉదయం అమ్మవారిని పంచామృతంతో అభిషేకాలు చేసి ప్రత్యేక అలంకరణ పూజలు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలక్కుండా ఏర్పాట్లు చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ పులిసత్యనారాయణరెడ్డి, కార్యదర్శి చక్రపాణి కోశాధికారి ప్రభాకర్ రెడ్డి సభ్యులు రమేష్ బాబు. శ్రీ సత్యమ్మ తల్లిని దుర్గాదేవి అలంకరణకు ఉబయదారులుగా బీదవాళ్లపల్లికి చెందిన ఆలయ కమిటీ సభ్యులు రమేష్ బాబు దంపతులు, గ్రామస్తులు వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు పులి సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ శ్రీ సత్యమ్మతల్లికి పిలిస్తే పలికే, కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారంగా పేరుందని, ప్రతి సంవత్సరం దసరాదేవి శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక అవతారాలలో అలంకరణ చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తూ తీర్థప్రసాదవిత్తరణ కావిస్తున్నామని రాజగోపర నిర్మాణంవల్ల దసరా సంబరాలు ఆశించిన మేర చేయలేకపోతున్నామని వచ్చే ఏడాది దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా కమిటీ సభ్యులు ఐకమత్యంతో జరిపిస్తామని ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. మరిన్ని అన్నమయ్య జిల్లా తాజా వార్తల కోసం C6TV News ఛానల్‌ను Subscribe చేయండి.Darshan of Sri Satyamma Talli adorned as Goddess Durga in Gandaboyinapalli | Dasara Sharannavaratri | C6TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *