A 'Golden Andhra' is Possible Only Through Cleanliness: MLA Arani SrinivasuluA 'Golden Andhra' is Possible Only Through Cleanliness: MLA Arani Srinivasulu

స్వచ్ఛతతోనే స్వర్ణాంధ్ర సాధ్యం: ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు

తిరుపతిని పరిశుభ్ర, సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు అందరూ భాగస్వాములు కావాలి: కమిషనర్ జయకృష్ణ

తిరుపతి, సెప్టెంబర్ 19: స్వచ్ఛాంధ్రతోనే స్వర్ణాంధ్ర సాధ్యమవుతుందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. పరిశుభ్రత అనేది కేవలం పారిశుద్ధ్య కార్మికుల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం తిరుపతి ఎన్జీవో కాలనీలోని మాల్వాడిగుండం కాలువ వద్ద నిర్వహించిన పారిశుద్ధ్య కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, నగరపాలక సంస్థ అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి కాలువను శుభ్రం చేసి, మొక్కలు నాటారు.

c6v.in

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ, స్వచ్ఛత ఉన్న చోటే ఆరోగ్యం, ఆరోగ్యం ఉన్న చోటే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. పరిశుభ్రమైన పరిసరాలు ప్రజల ఆరోగ్యానికి, నగర అభివృద్ధికి ఎంతో అవసరమని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, యువ నాయకులు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లక్ష్యంగా నిర్దేశించుకున్న స్వర్ణాంధ్ర సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

A ‘Golden Andhra’ is Possible Only Through Cleanliness: MLA Arani Srinivasulu

మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో, అదే విధంగా మన వీధి, కాలనీ, నగరాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎమ్మెల్యే అన్నారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా పరిసరాల పరిశుభ్రతను కాపాడాలని, పారిశుద్ధ్య సిబ్బందికి ప్రజలు సహకరించాలని కోరారు. పచ్చదనం పెంపొందించేందుకు విస్తృతంగా మొక్కలు నాటి వాటి సంరక్షణకు కూడా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని సూచించారు.

నగరపాలక సంస్థ కమిషనర్ జయకృష్ణ మాట్లాడుతూ, పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచి, సుందర నగరంగా నిలిపేందుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, యువత సమష్టిగా కృషి చేయాలని కోరారు. నగర పరిశుభ్రత విషయంలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని తెలిపారు.

చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా, తడి చెత్త, పొడి చెత్తను ఇంటి వద్దనే వేరు చేసి పారిశుద్ధ్య కార్మికులకు అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. పరిశుభ్రమైన నగరంగా తిరుపతిని నిలపడంలో యువత కీలక పాత్ర పోషించాలని, యువత ముందుకు వచ్చి స్వచ్ఛత కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. పరిసరాల పరిశుభ్రతకు కట్టుబడి ఉంటామని కార్యక్రమంలో పాల్గొన్న వారందరి చేత కమిషనర్ జయకృష్ణ ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, టీటీడీ బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగుణమ్మ, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, గంగమ్మ గుడి చైర్మన్ మహేష్ యాదవ్, ఇంచార్జి జె.బి. శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ, మాజీ కార్పొరేటర్ అన్నా అనిత, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది, ఎన్‌సీసీ క్యాడెట్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *