పలమనేరు నియోజకవర్గంలో దారుణం.. గుడిసెను కూల్చి, బాధితుడిపై మూకుమ్మడి దాడి! అధికారుల నిర్లక్ష్యంపై బాధితుడి ఆవేదన..

పలమనేరు నియోజకవర్గ పరిధిలోని పెద్దపంజాణి మండలం లింగాపురం పంచాయతీ గడ్డంవారిపల్లిలో ఓ నిరుపేద కుటుంబంపై జరిగిన అణచివేత, దౌర్జన్యం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ స్థలంలో గుడిసె వేసుకుని జీవిస్తున్న తమపై గ్రామస్తులు జేసీబీతో దాడి చేసి, సర్వస్వం ధ్వంసం చేశారంటూ బాధితుడు గంగులప్ప కన్నీరుమున్నీరయ్యారు.
బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. తాము జోగి కులానికి చెందిన వాళ్లమని, పూర్వీకుల కాలం నుంచి గడ్డంవారిపల్లిలోనే నివసిస్తున్నామని తెలిపారు. సుమారు 40 సంవత్సరాల క్రితం తాము పెంచుకుంటున్న పందుల వల్ల గ్రామంలో రోగాల బారిన పడుతున్నారని గ్రామ పెద్దలు సూచించడంతో.. సమీపంలోని నల్లగుట్ట ప్రాంతానికి వెళ్లి గుడిసె వేసుకొని నివసిస్తున్నట్లు చెప్పారు. కాలక్రమేణా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పందుల వ్యాపారాన్ని పూర్తిగా మానేసి, పాడి ఆవులు కొనుగోలు చేసి వాటి ద్వారా వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నట్లు తెలిపారు.
అయితే, తమ జీవనోపాధిని దెబ్బతీసేందుకు గ్రామ పెద్దలు చలపతి, వెంకటరామయ్య, నరసింహులు, అశోక్, సీనప్ప తదితరులు గ్రామస్తులను రెచ్చగొట్టారని ఆరోపించారు. తాము లేని సమయంలో జేసీబీతో పశువుల షెడ్డుతో పాటు తాము పెంచుకున్న చెట్లను కూడా కూల్చి నేలమట్టం చేశారని వాపోయారు.

Palamaner Constituency: Hut Demolished and Victim Attack
విషయం తెలుసుకుని తన భార్యతో కలిసి అక్కడికి వెళ్లి జేసీబీని అడ్డుకోబోగా.. గ్రామస్తులు సుధాకర్, శ్రీరాములు, రమేష్, కృష్ణప్ప, సుబ్రహ్మణ్యం, కొండప్పలతో పాటు మరికొందరు మూకుమ్మడిగా దాడి చేసి రక్తపు గాయాలు చేశారని తెలిపారు. అక్కడే ఉంటే ప్రాణాలతో ఉండరని బెదిరింపులకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై వెంటనే పంజాణి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ, దాడి జరిగి రెండు నెలలు గడుస్తున్నా పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితుడు ఆరోపించారు. తనకు జరిగిన అన్యాయంపై మండల తహసిల్దారును ఆశ్రయించగా.. ఆయన ఐదు రోజుల క్రితం స్వయంగా ఘటనా స్థలాన్ని పరిశీలించి, పశువుల ఇబ్బందులను చూసి అక్కడే షెడ్డు వేసుకోవాలని సూచించినట్లు తెలిపారు.Palamaner Constituency: Hut Demolished and Victim Attack

Palamaner Constituency: Hut Demolished and Victim Attack
అయినా సరే, కొందరు గ్రామస్తులు వచ్చి పనులు అడ్డుకుంటూ దౌర్జన్యానికి దిగుతున్నారని, వీరందరి వల్ల తన కుటుంబానికి ప్రాణహాని ఉందని బాధితుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి ఈ దౌర్జన్యాలను అరికట్టాలని, తమ కుటుంబానికి తగిన రక్షణ కల్పించాలని వేడుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *