తిరుపతి, సెప్టెంబర్, 19: జిల్లాలో స్వచ్ఛతా హి సేవా – 2026 కార్యక్రమం అమలుపై జిల్లాలోని వివిధ శాఖల జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు మరియు మున్సిపల్ సిబ్బందితో శనివారం ఉదయం స్థానిక కలెక్టరేట్ ఛాంబర్ నుండి జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించి ఏర్పాట్లు మరియు కార్యాచరణ ప్రణాళికపై సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాన్ని జిల్లాలో అన్ని శాఖలు, స్థానిక సంస్థలు సమన్వయంతో సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. నిర్దేశించిన కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో స్పష్టమైన, శాశ్వతమైన ఫలితాలు సాధించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పరిశుభ్రత, పారిశుధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణ, ప్రజల్లో అవగాహన మరియు ప్రజల భాగస్వామ్యానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, District Collector Dr. S.Venkateswar review meeting via Zoom

c6tv.in

ప్రభుత్వ శాఖలు, క్షేత్రస్థాయి సిబ్బంది మరియు ప్రజలను భాగస్వామ్యం చేస్తూ కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించారు. స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాల నిర్వహణకే పరిమితం కాకుండా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పరిశుభ్రత మరియు పారిశుధ్య నిర్వహణలో శాశ్వతమైన మెరుగుదలలు సాధించే విధంగా సంబందిత అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ స్పష్టం చేశారు. స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాల అమలును అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, నిర్వహించిన కార్యక్రమాలను సమగ్రంగా డాక్యుమెంట్ చేసి, నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం నివేదికలు సమర్పించాలని ఆదేశించారు.

డి.ఐ.పి.ఆర్.ఓ. తిరుపతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *