NEET UG Results 2026: దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET UG) 2026 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) గురువారం అధికారికంగా విడుదల చేసింది. జూన్ 21న నిర్వహించిన రీ-ఎగ్జామ్ అనంతరం, షెడ్యూల్ ప్రకారం కౌన్సిలింగ్ ప్రక్రియను ప్రారంభించేందుకు NTA ఈ ఫలితాలను ప్రకటించింది.
ఈ ఏడాది మొత్తం 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత సాధించగా.. అందులో అద్భుతమైన ప్రతిభ కనబరిచి 690 లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన 138 మంది అభ్యర్థుల పూర్తి జాబితాను NTA విడుదల చేసింది.
నీట్ యూజీ 2026 ముఖ్యాంశాలు (Key Highlights)
- మొత్తం హాజరైన వారు: దేశవ్యాప్తంగా దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు.
- పరీక్షా కేంద్రాలు: భారతదేశంలోని 551 నగరాలు, విదేశాల్లోని 14 నగరాలతో కలిపి మొత్తం 5,440 కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించారు.
- భాషలు: మొత్తం 13 ప్రాంతీయ భాషల్లో నీట్ పరీక్ష జరిగింది.
- మహిళల హవా: క్వాలిఫై అయిన మొత్తం అభ్యర్థులలో 58 శాతానికి పైగా మహిళలే కావడం విశేషం.
- ఫస్ట్-టైమ్ అచీవర్స్: 690 కంటే ఎక్కువ స్కోర్ సాధించిన 138 మంది టాపర్లలో 93% మంది మొదటి ప్రయత్నంలోనే ఈ ఘనత సాధించడం గమనార్హం.

నీట్ యూజీ 2026 లో సంచలనం.. గరిష్ట మార్కులు సాధించిన 138 మంది మేధావులు వీరే!
జాతీయ టాపర్లు వీరే! (NEET UG 2026 Toppers)
ఈ ఏడాది నీట్ యూజీ పరీక్షలో పంజాబ్‌కు చెందిన ఆర్యన్ గుప్తా (Aryan Gupta), హర్యానాకు చెందిన పాన్షుల్ బన్సాల్ (Panshul Bansal) సంయుక్తంగా జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచారు. వీరిద్దరూ 720 మార్కులకు గానూ 715 మార్కులు సాధించి సంచలనం సృష్టించారు.
690 లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించి మెరిసిన టాప్ విద్యార్థుల వివరాలు కింద ఇవ్వబడ్డాయి:
తెలుగు రాష్ట్రాల టాపర్లు (ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ):
- వీరియాగారి సాయు (తెలంగాణ) – Veeriahgari Sahyu
- బురా సాయి శరన్ (తెలంగాణ) – Bura Sai Sharan
- కందగట్ల హనీష్ (తెలంగాణ) – Kandagatla Haneesh
- నమల ప్రేరణ (ఆంధ్రప్రదేశ్) – Namala Prerana
- అందెం సాయి చరణ్ రెడ్డి (తెలంగాణ) – Andem Sai Charan Reddy
- మయుక్ జయసింహ (తెలంగాణ) – Mayuk Jayasimha
- గ్రాంధి హనీష్ (ఆంధ్రప్రదేశ్) – Grandhi Haneesh
- కొంపెల్ల సాయి గాయత్రి తేజోఅరుణిమ (తెలంగాణ) – Kompella Sai Gayathri Tejoarunima
- రేలంగి జయషణ్ముఖి (ఆంధ్రప్రదేశ్) – Relangi Jayashanmukhi
- రుతుంబికా మహంతి (తెలంగాణ) – Rutumbika Mohanty
- కొండ్రెడ్డి హారికా దేవి శ్రీ అనుహ్య (ఆంధ్రప్రదేశ్) – Kondreddi Harika Devi Sri Anuhya
- దేవేష్ శ్రీగోపాల్ అగర్వాల్ (తెలంగాణ) – Devesh Shreegopal Agrawal
- వంగ శ్రీనివాస రెడ్డి (ఆంధ్రప్రదేశ్) – Vanga Srinivasa Reddy
- వద్దెపల్లి దుష్యంత్ (ఆంధ్రప్రదేశ్) – Vaddepalli Dushyant
దేశవ్యాప్తంగా ఉన్న ఇతర టాపర్లు:
- ఆర్యన్ గుప్తా (పంజాబ్)
- పాన్షుల్ బన్సాల్ (హర్యానా)
- ఉప్లక్ష్య గోయల్ (రాజస్థాన్)
- ఆయుష్ భలోటియా (బీహార్)
- కుదాలే శ్రవణి కృష్ణ (మహారాష్ట్ర)
- రియా రంజన్ (బీహార్)
- ఆర్యన్ దూబే (ఉత్తర ప్రదేశ్)
- గీతాంశ్ సరిన్ (పంజాబ్)
- గౌరవ్ సింగ్ (రాజస్థాన్)
- మొహనీష్ మారుతి భోసలే (మహారాష్ట్ర)
- అభిలాష్ (రాజస్థాన్)
- వెంకటపతి వేలాయుధం వి ఎ (తమిళనాడు)
- పాటిల్ సార్థక్ మహేష్ (మహారాష్ట్ర)
- క్రిష్ గుప్తా (పంజాబ్)
- కార్తీక్ చౌదరి (రాజస్థాన్)
- మాన్షా గార్గ్ (హర్యానా)
- కృతిక్ జైన్ (రాజస్థాన్)
- వైష్ణవి దాస్ (కర్ణాటక)
- హర్షిల్ గుప్తా (రాజస్థాన్)
- మానస్వి కుల్‌శ్రేష్ఠ (హర్యానా)
- కాశ్వి ధాల్ (ఢిల్లీ)
- తహా సామున్ భాటియా (గుజరాత్)
- పటేల్ శౌర్య భవేష్ (గుజరాత్)
- శ్రీనిక వి (తమిళనాడు)
- సానిధ్య క్షితిజ్ డోంగ్రే (మహారాష్ట్ర)
- ఆషి గోయల్ (పంజాబ్)
- అక్షిత్ కుమార్ గౌర్ (గుజరాత్)
- ప్రఖర్ బన్సాల్ (రాజస్థాన్)
- అర్ణవ్ లహోటి (మహారాష్ట్ర)
- టెంబూర్నే ప్రణవ్ పురన్‌లాల్ (మహారాష్ట్ర)
- రౌష్మిత్ గుప్తా (మహారాష్ట్ర)
- సబ్యసాచి లస్కర్ (పశ్చిమ బెంగాల్)
- రుద్రాక్ష కొచ్చర్ (హర్యానా)
- రణ్‌వీర్ కుమార్ (రాజస్థాన్)
- సాత్విక్ పట్నాయక్ (ఒడిశా)
- ఆన్వి సక్సేనా (హర్యానా)
- హియా జాస్మిన్ వాసవాడ (గుజరాత్)
- మాధవన్ మహాజన్ (చండీగఢ్)
- సుదర్ ఎ ఎమ్ (తమిళనాడు)
- ఆర్యమాన్ సింగ్ సోలంకి (మధ్యప్రదేశ్)
- దైవిక్ మిద్ధా (రాజస్థాన్)
- సుచిత ఎమ్ (కర్ణాటక)
- తేజస్ వరుణ్ రెడ్డి (ఢిల్లీ)
- అర్ణవ్ జిందాల్ (పంజాబ్)
- వనీషా సతీష్ (తమిళనాడు)
- గుంజన్ (ఉత్తర ప్రదేశ్)
- పాటిల్ సోహమ్ నిషికాంత్ (మహారాష్ట్ర)
- యష్ (రాజస్థాన్)
- రవి కాంత్ దివాకర్ (బీహార్)
- భవికా గుప్తా (పంజాబ్)
- సౌమ్య పటేల్ (గుజరాత్)
- అనుష్క చౌదరి (రాజస్థాన్)
- శబరి జి ఎన్ (తమిళనాడు)
- హన్షిక (ఢిల్లీ)
- అంకుర్ కుమార్ (ఢిల్లీ)
- రవికిరణ్ కిని (కర్ణాటక)
- ప్రకుల్ గార్గ్ (పంజాబ్)
- దిగంత్ బి ఎస్ (కర్ణాటక)
- కుశాగ్ర మిట్టల్ (ఢిల్లీ)
- హర్షుల్ గార్గ్ (చండీగఢ్)
- సాగర్ రాజేష్ కరికర్ (మహారాష్ట్ర)
- వంశం రాజ్ సింగ్ (ఉత్తర ప్రదేశ్)
- జోహాన్ జాబ్ (కర్ణాటక)
- సమర్థ్ సైనీ (చండీగఢ్)
- భవ్య గున్వాల్ (రాజస్థాన్)
- క్రిష్ చౌహాన్ (ఉత్తర ప్రదేశ్)
